రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు.. ఇంటికొచ్చి బలవంతంగా..!
on Jul 29, 2021
నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకరోజు రాజ్ కుంద్రా తన ఇంటికి వచ్చి తనను కిస్ చేశాడని.. తనకు భయం వేసి వాష్ రూమ్ కు పారిపోయానని తెలిపింది.
పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు.. ఈ కేసుకి సంబంధించి పలువురుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో షెర్లిన్ చోప్రాకు కూడా సమన్లు పంపించారు. అయితే విచారణ సందర్భంగా తన స్టేట్మెంట్ లో షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు చేసిందని తెలుస్తోంది. 2019లో తన బిజినెస్ మేనేజర్ కు రాజ్ కుంద్రా ఫోన్ చేశారని.. 2019 మార్చ్ 27న తమ మధ్య బిజినెస్ మీటింగ్ జరిగిందని తెలిపింది. ఆ తర్వాత ఒక రోజు చెప్పాపెట్టకుండా రాజ్ కుంద్రా తన ఇంటికి వచ్చాడని.. తాను వారిస్తున్నా వినకుండా బలవంతంగా తనను కిస్ చేయడం మొదలు పెట్టాడని పేర్కొంది.
అంతేకాదు, తన భార్య శిల్పాశెట్టితో రిలేషన్ కాంప్లికేటెడ్ గా ఉందని.. ఇంటి వద్ద ఎంతో స్ట్రెస్ కు గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని షెర్లిన్ చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేసిందని.. రాజ్ కుంద్రా ను తోసేసి వాష్ రూమ్ కు పారిపోయానని తెలిపింది. పెళ్లయిన వ్యక్తితో సంబంధాన్ని తాను కోరుకోలేదని.. అదే విధంగా శారీరక సుఖాలను బిజినెస్ తో ముడిపెట్టాలని కూడా అనుకోలేదని షెర్లిన్ పేర్కొంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
